గురువారం 04 జూన్ 2020
Telangana - Nov 25, 2019 ,

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన గిరిబాబు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన గిరిబాబు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటుడు గిరిబాబు ఈ రోజు మొక్కలు నాటారు. 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ నటుడు కాదంబరి కిరణ్ గారు ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా గిరిబాబు గారు మాట్లాడుతూ మొక్కలను మనం నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. 

రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరొక ముగ్గురిని  మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.1) ప్రముఖ హాస్యనటుడు ఆలీ 2) కృష్ణ భగవాన్ 3) రఘు బాబు లకు మొక్కలు నాటాలని కొరారు. ఈ కార్యక్రమంలో  సినీ నటుడు కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ పాల్గొన్నారు.


గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ మొక్కలు నాటారు. 

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ములుగు కలెక్టర్ నారాయణ రెడ్డి విసిరిన ఛాలెంజ్ కు  ఈరోజు మూడు మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా   కలెక్టర్ హరీష్ గారు మరొక ముగ్గురిని  మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.


 హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవి,  దేవులపల్లి శ్రీనివాస్, యాష్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి లకు  గ్రీన్ ఛాలెంజ్ లో  భాగంగా మొక్కలు నాటాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వై సతీష్ రెడ్డి , టీఆర్ఎస్  స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కూడా పాల్గొన్నారు


logo