గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 16:33:09

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్‌’ : మేయర్ రామ్మోహన్

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్‌’ :  మేయర్ రామ్మోహన్

హైదరాబాద్ :  ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియా మీట్ నిర్వహించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో  ప్రజలందరూ ఒకరికొకరు తోడుగా ముందుకు నడువాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల నేతృత్వంలో రాష్ట్రం కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని మేయర్ తెలిపారు.

అలాగే మంత్రి కేటీఆర్.. కరోనాపై యుద్ధంతో పాటు, నగరాభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారని వివరించారు. అంతేకాదు ప్రజలకు ఆయన చిరునవ్వులు బహుకరిస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే అందరూ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. తోటి వారి ముఖాల్లో చిరునవ్వులు వెలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జులై 24న కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌కు పిలుపునిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు.

ఆపదలో ఉన్నవారికి ఆసరాగా ఉందామని ఆయన పిలపునిచ్చారు. పుట్టిన రోజున పూల బొకేలు, శాలువాలు, పత్రికా ప్రకటనలు, హోర్డింగుల మీద డబ్బు ఖర్చు చేయకుండా.. సాటి మనిషికి సాయపడదాం. వస్తు రూపంలో గానీ, ధన రూపంలో గానీ పేద ప్రజలకు అవసరాలు తీర్చాలి. ఇదే మన నాయకుడికి ఇచ్చే అసలైన గిఫ్ట్ అన్నారు.


logo