బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 06:53:00

కేటీఆర్‌ బర్త్‌డేకు చిరునవ్వే కానుక

కేటీఆర్‌ బర్త్‌డేకు చిరునవ్వే కానుక

  • శాలువా, బొకే వద్దు..ఆపన్నులను ఆదుకోండి
  • మేయర్‌ బొంతు, ఎమ్మెల్సీ నవీన్‌ పిలుపు

హైదరాబాద్‌ : ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయంచేసి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపడమే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు నిజమైన జన్మదిన కానుకని పలువురు పిలుపునిచ్చారు.  ఈ నెల 24న మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ కే నవీన్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వేర్వేరుగా విజ్ఞప్తిచేశారు. కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్ఛాలు, శాలువాలు, ఇతర ఆర్భాటాలకు డబ్బు  ఖర్చుచేయొద్దని, దానికి బదులుగా కొవిడ్‌ సమయంలో కష్టాల్లో ఉన్న వ్యక్తుల అవసరాలను తీర్చాలని కోరారు. ఆ ఫొటోలు, వివరాలను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేస్తూ కేటీఆర్‌ సోషల్‌మీడియాకు ట్యాగ్‌చేయాలని విజ్ఞప్తిచేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరాన్ని  నిర్వహించనున్నట్టు బొంతు రామ్మోహన్‌ వెల్లడించారు.  


logo