ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 18:26:31

జీహెచ్‌ఎంసీ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ ప్రకటన

జీహెచ్‌ఎంసీ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ ప్రకటన

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్‌ 7న జీహెచ్‌ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన వెలువడనుంది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో 9న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సమావేశం కానున్నారు. అదేవిధంగా 10వ తేదీన సర్కిల్‌ స్థాయిలో పార్టీల ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ల సమావేశం జరగనుంది. నవంబర్‌ 13న జీహెచ్‌ఎంసీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.