గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 19:38:36

కరోనా వైరస్‌ కట్టడికి అనేక చర్యలు చేపట్టాం: జీహెచ్‌ఎంసీ

కరోనా వైరస్‌ కట్టడికి అనేక చర్యలు చేపట్టాం: జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి అనేక చర్యలు చేపట్టామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారు నగరంలో మొత్తం 13 వేల మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారైంటైన్‌ ముద్ర వేస్తాం. క్వారంటైన్‌లో ఉన్నారా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నాం. ఎవరైనా క్వారంటైన్ ముద్ర ఉండి, ఇంట్లో ఉండకుండా బయట కనిపిస్తే వారి గురించిన సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

రేపు పారిశుద్ధ్య సిబ్బంది యథావిధిగా విధుల్లో ఉంటారు. నగర ప్రజలు జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి. సోడియం, పైతోక్లోరైడ్‌ స్ప్రేయింగ్‌ చేస్తున్నాం. కరోనా లక్షణాలు ఉంటే 108కు కాల్‌ చేయలని కోరారు. కరోనా పేషంట్ల కోసం ప్రత్యేకంగా 108 వాహనాలలో వారిని ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చి ఎవరైనా క్వారైంటైన్‌ ముద్ర లేకుంటే 104 నెంబర్‌కు కాల్‌ చేసి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


logo