గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 13:35:53

ముంపు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు

ముంపు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఇంకా పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో సీజనల్‌ వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వరద నిలిచిన కాలనీల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిస్తున్నారు. 60 ట్యాంకర్ల ద్వారా హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తోంది. ఇందుకు 30 డీఆర్‌ఎఫ్‌, 30 ఫైర్‌ సర్వీస్‌ ట్యాంకర్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్‌ అధికారులు నిరంతరం అప్రమత్తతో ఉంటూ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. బాధితులకు తాగునీరు, ఆహారం అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo