మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:24

శభాష్‌ బల్దియా!

శభాష్‌ బల్దియా!

  • మహబూబ్‌ చౌక్‌ క్లాక్‌టవర్‌ సుందరీకరణపై కేటీఆర్‌ ట్వీట్‌

చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా మరో ప్రాచీన కట్టడానికి మరమ్మతులుచేసి, అందంగా తీర్చిదిద్దిన జీహెచ్‌ఎంసీని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆరోనిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో 1892లో చార్మినార్‌కు సమీపంలో నిర్మించిన మహబూబ్‌ చౌక్‌ క్లాక్‌టవర్‌ శిథిలావస్థకు చేరుకొన్నది. బల్దియా దక్షిణ మండలం అధికారులు ఈ కట్టడాన్ని ఇటీవలే సుందరీకరించారు. ‘నగరంలోని మరో చారిత్రాత్మక కట్టడం సుందరీకరణ పనులను జీహెచ్‌ఎంసీ విజయవంతంగా పూర్తిచేసింది. మహబూబ్‌చౌక్‌లో ఉన్న క్లాక్‌టవర్‌ సుందరీకరణ తర్వాత ఆ కట్టడాన్ని వీక్షించడం సంతోషంగా కన్నుల పండువగా ఉన్నది. జీహెచ్‌ఎంసీకి ప్రత్యేక అభినందనలు.. ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలి’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌చేశారు. మహబూబ్‌ చౌక్‌ క్లాక్‌టవర్‌ పాత, కొత్త ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టుచేశారు.logo