ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 13:05:39

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్‌

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్‌

హైద‌రాబాద్ : మాస‌బ్‌ట్యాంక్‌లో ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్‌ను న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ.. వ‌ర‌దల కార‌ణంగా న‌గ‌రంలో చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోయింద‌న్నారు. పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 30 స‌ర్కిళ్ల‌లో ప్ర‌త్యేక శానిటేష‌న్ డ్రైవ్ చేప‌ట్టామ‌ని తెలిపారు. గ‌త 15 రోజుల్లో ల‌క్ష మెట్రిక్ ట‌న్నుల చెత్త, నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గించామ‌ని గుర్తు చేశారు. ఇంకా 30 వేల మెట్రిక్ ట‌న్నుల చెత్త‌ను తొల‌గించాల్సి ఉంద‌న్నారు. చెత్త‌, నిర్మాణ వ్య‌ర్థాల‌ను త‌ర‌లించేందుకు 536 వాహ‌నాల‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లు తెలిపారు. చెత్త తొల‌గింపు ప‌నుల్లో వేలాది మంది కార్మికులు నిమ‌గ్న‌మ‌య్యారు.