ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 07:16:57

27న జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం రద్దు

27న జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం రద్దు

హైదరాబాద్ :  ఈ నెల 27 ( బుధవారం)న నిర్వహించ తలపెట్టిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం రద్దు చేస్తున్నట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పరోక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన నాటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆదర్శ ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2021-22ఆర్థిక సంవత్సరానికిగాను జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌ ముసాయిదాపై చర్చించే కౌన్సిల్‌ సమావేశం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా పాత పాలకమండలికి ఇక సమావేశం లేనట్లుగానే భావించాలి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo