గురువారం 26 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 11:47:26

మూసీ నాలా ప‌టిష్ట‌త‌కు రూ. 68.40 కోట్లు

మూసీ నాలా ప‌టిష్ట‌త‌కు రూ. 68.40 కోట్లు

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్ నుంచి మూసీ వ‌ర‌కు ఉన్న నాలా ప‌టిష్ట‌త‌, అభివృద్ధికి రూ. 68.40 కోట్ల నిధుల‌తో ప‌నులు చేప‌డుతున్న‌ట్లు జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. న‌ల్ల‌కుండ డివిజ‌న్‌లోని ర‌త్న న‌గ‌ర్ బ‌స్తీని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్‌, స్థానిక కార్పొరేట‌ర్ గ‌రిగంటి శ్రీదేవి ర‌మేశ్‌, ముఠా ప‌ద్మ‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేష‌న్ అధికారుల‌తో క‌లిసి బొంతు రామ్మోహ‌న్ ప‌ర్య‌టించారు. ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ ర‌త్న న‌గ‌ర్ బ‌స్తీలో ప‌ర్య‌టించి వ‌ర‌ద బాధితుల‌కు ఆర్థిక సాయం అందించారు. ర‌త్న న‌గ‌ర్ బ‌స్తీని అనుకుని ఉన్న రిటైనింగ్ వాల్ నిర్మించి, ఈ ప్రాంతంలోని కాల‌నీల ప్ర‌జ‌ల‌కు వ‌ర‌ద ముంపు నుంచి శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో కేటీఆర్ ఆదేశాల మేర‌కు ఇవాళ మేయ‌ర్‌, ఎమ్మెల్యే ప‌ర్య‌టించి హుస్సేన్ సాగ‌ర్ నుంచి మూసీ వ‌ర‌కు ఉన్న నాలా ప‌టిష్ట‌త‌, అభివృద్ధికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. హుస్సేన్ సాగర్ నుంచి మిగులు జలాలు ప్రవహిస్తున్న రత్న నగర్ నాలాకు పొడవున రిటైనింగ్ వాల్‌ను నిర్మించనున్నట్లు మేయ‌ర్ తెలిపారు.