మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 18:51:42

నిర్లక్ష్యానికి చెల్లించాడు.. భారీ మూల్యం!

నిర్లక్ష్యానికి చెల్లించాడు.. భారీ మూల్యం!

హైదరాబాద్ : హైదరాబాద్ నానక్ రాంగూడ హనుమాన్ గుడి సమీపంలో రోడ్డుపైకి నీటిని విడుదల చేసినందుకు ఓ భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం రూ.లక్ష జరిమానా విధించారు. భవన సెల్లార్‌లో పేరుకుపోయిన నీటిని మోటార్‌ ద్వారా నీటిని పంప్‌ చేస్తూ.. పైప్‌ను ఔటర్‌ రింగ్‌ రోడ్డు సర్వీస్‌ రోడ్డుపై యజమాని వదిలేశాడు. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు నీటి విడుదలను నిలిపివేయాలని యజమానిని ఆదేశించారు. అనంతరం జీహెచ్ఎంసీ చట్టం సెక్షన్ 674 కింద వాసవీ జీపీ ట్రెండ్స్ యజమాని సుధాకర్‌రెడ్డికి జరిమానా విధించాలని జీహెచ్‌ఎంసీని పోలీసులు సూచించారు. భవనం యజమాని పలుమార్లు ఇలాగే ప్రవర్తించాడని అధికారులు పేర్కొన్నారు. ఆదేశాలు పాటించకపోవడంతో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌ భవన యజమానికి రూ.లక్ష జరిమానా విధించారు. రోడ్లపైకి నీరు విడుదల చేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పాటు బైక్‌ స్కిడ్‌ అవడంలాంటి పలు ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీలో నమోదువుతున్నాయి. వాహనదారులకు ఆటంకం కలిగించే, రోడ్లను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo