ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 20, 2021 , 21:13:24

ట్రాఫిక్‌ నిర్వహణపై జీహెచ్‌ఎంసీ సమావేశం

ట్రాఫిక్‌ నిర్వహణపై జీహెచ్‌ఎంసీ సమావేశం

హైదరాబాద్‌ : నగరంలోని శేరిలింగంపల్లి జోన్‌లో వివిధ రహదారుల భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణ సమస్యలపై చర్చించేందుకు జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, ఇతర సంబంధిత ఏజెన్సీల అధికారులు బుధవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో జోనల్‌స్థాయి కన్వర్జెన్స్‌ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో రోడ్‌ మార్కింగ్స్‌, జంక్షన్‌ డెవలప్‌మెంట్స్‌, ఫుట్‌పాత్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, నీటి నిల్వ ఉండే ప్రదేశాలు, డ్రైనేజీ, నీటి లీకేజీ సమస్యలు మొదలైనవాటిపై వివరంగా చర్చించారు. అదేవిధంగా నిర్థిష్ట సమయంలోపు ఈ సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌ కుమార్‌, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ చంద్రశేఖర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo