సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 19:02:09

కరోనా హెచ్చరిక: తెరిచి ఉంచిన 66 సంస్థలు సీజ్‌

కరోనా హెచ్చరిక: తెరిచి ఉంచిన 66 సంస్థలు సీజ్‌

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి దృష్ట్యా నగరంలో పలు చోట్ల జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తనిఖీలు నిర్వహించింది. తెరిచి ఉంచిన విద్యాసంస్థలు, పబ్‌లు, సంస్థల్లో అధికారులు తనిఖీలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలు అనుసరించకుండా తెరిచి ఉంచిన 66 సంస్థలను అధికారులు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఈడీ విశ్వదత్‌ మాట్లాడుతూ... యాజమాన్యాలు కరోనా నివారణకు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులకు మాస్కులు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 18 బృందాలు ఏర్పాటు చేశాం. రద్దీ ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. వినియోగదారులకు ప్రవేశద్వారం వద్దే శానిటైజర్‌ అందించాలి. నిబంధనలు అతిక్రమించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. యాజమాన్యాలు బాధ్యతతో వైరస్ వ్యాప్తి  జరగకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. 


logo