మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 18:11:30

అధునాత‌న టెక్నాల‌జీతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు

అధునాత‌న టెక్నాల‌జీతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఎన్నిక‌ల సంఘం అధికారులు, జీహెచ్ఎంసీ అధికారుల‌తో రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ పార్థసార‌థి స‌మావేశం నిర్వ‌హించారు. పార‌ద‌ర్శ‌కంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు టీ పోల్ పై అధికారుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి మాట్లాడుతూ.. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో అధునాత‌న టెక్నాల‌జీ వినియోగిస్తామ‌న్నారు. క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఓట‌ర్ల లిస్టు, పోలింగ్ కేంద్రాల వివ‌రాలు ఆన్‌లైన్‌లో పొందుప‌రుస్తామ‌ని తెలిపారు. నామినేష‌న్ నుంచి ఫ‌లితాల వ‌ర‌కు మొత్తం ప్ర‌క్రియ ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. పోటీ చేసిన స్వ‌తంత్ర, పార్టీ అభ్య‌ర్థుల వివ‌రాల‌ను టీ పోల్ ద్వారా తెలుసుకోవ‌చ్చు అని చెప్పారు. సాంకేతిక ప‌రిజ్ఞానం వ‌ల్ల త‌క్కువ స‌మ‌యంలో, త‌క్కువ సిబ్బందితో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు. 150 పోలింగ్ కేంద్రాల్లో వార్డుకు ఒక ఫేస్ రిక‌గ్నేష‌న్ యాప్‌తో ఓట‌రు పూర్తి వివ‌రాలు న‌మోదు చేయొచ్చు. సీనియ‌ర్ సిటిజ‌న్, దివ్యాంగుల‌కు పైల‌ట్ ప్రాజెక్టు కింద ఈ- ఓటింగ్ విధానం అమ‌లు చేస్తామ‌ని ఎన్నిక‌ల క‌మిష‌నర్ చెప్పారు. 


logo