గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 18:11:41

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల స‌న్నాహానికి శ్రీకారం

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల స‌న్నాహానికి శ్రీకారం

హైద‌రాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌న్నాహానికి రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ మేర‌కు ఆయా రాజ‌కీయ పార్టీల‌కు రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం లేఖ‌లు రాసింది. కొవిడ్ దృష్ట్యా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విధానంపై పార్టీల అభిప్రాయాల‌ను కోరింది. ఎన్నిక‌ల‌ను ఈవీఎం ద్వారా లేక బ్యాలెట్ ద్వారా నిర్వ‌హించాలా? అనే అంశంపై అభిప్రాయాల‌ను చెప్పాల‌ని పార్టీల‌ను ఎన్నిక‌ల సంఘం కోరింది. 

నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి శుక్రవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, కోవిడ్‌ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లు, తదితర అంశాలపై చర్చించారు. మ‌రో నాలుగైదు నెల‌ల్లో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.


logo