గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 17:06:32

'బ్యాలెట్ ప‌ద్ధ‌తిలోనే జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు నిర్వ‌హించండి'

'బ్యాలెట్ ప‌ద్ధ‌తిలోనే జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు నిర్వ‌హించండి'

హైద‌రాబాద్ : తెలంగాణ ‌రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థిని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని టీఆర్ఎస్ నేత‌లు క‌లిశారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు టీఆర్ఎస్ నేత‌లు విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై అభిప్రాయాల‌ను తెలుపాల‌ని ఇప్ప‌టికే ఆయా పార్టీల‌కు ఎన్నిక‌ల సంఘం లేఖ‌లు రాసిన విష‌యం విదిత‌మే. 

జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తవుతున్నది. ఈలోగా కొత్త పాలకమండలిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు కమిషనర్‌ ఏర్పాట్లు మొదలుపెట్టారు. గతంలో 1200మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుచేయగా, ఈసారి కరోనా నేపథ్యంలో 800మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. దీంతో ఈసారి పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 10వేలకు చేరుతుందని అధికారులు తెలిపారు. 


logo