గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 20:52:01

టీఆర్‌ఎస్‌కు విశేష ఆదరణ

టీఆర్‌ఎస్‌కు విశేష ఆదరణ

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పార్టీ అభ్యర్థులు, నాయకులు ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఆరేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి పలుపార్టీల నాయకులు, యువత గులాబీ పార్టీలో చేరుతున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్‌ డివిజన్‌లో శుక్రవారం చైతన్య నగర్, భక్షిగూడ, రాజీవ్ నగర్, అన్నపూర్ణ కాలనీలకు చెందిన వెయ్యి బీజేపీ కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

ఈ డివిజన్‌లో చేరికల పరంపర శనివారం సైతం కొనసాగింది.  శనివారం రాజీవ్ నగర్‌లో 500 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. ప్రచారానికి రేపటి వరకే గడువు ఉండటంతో డివిజన్‌లో అన్నికాలనీల్లో మంత్రి ఎర్రబెల్లి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభుదాస్‌తో కలిసి మధ్యాహ్నం వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ డివిజన్ అపార్టుమెంట్‌ అసోసియేషన్ సభ్యులు టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అధికార పార్టీకే అండగా ఉంటామన్న హౌసింగ్ బోర్డు మునిసిపల్ కార్మికులు చెప్పారు. రాజీవ్ నగర్ క్రైస్ట్ గాస్పెల్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్లు టీఆర్ఎస్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo