ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 07:22:21

ప్రారంభమైన జీహెచ్‌ఎంసీ పోలింగ్‌

ప్రారంభమైన జీహెచ్‌ఎంసీ పోలింగ్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 15 ఏండ్ల తర్వాత జీహెచ్‌ఎంసీలో మొదటిసారిగా బ్యాలెట్‌ పత్రాలు ఉపయోగిస్తున్నారు. ఓటింగ్‌ కోసం తెలుపు రంగు బ్యాలెట్‌ పేపర్లు వినియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 1122 మంది అభ్యర్థుల ఉన్నారు. 74,67,025 ఓటర్లు  తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గ్రేటర్‌లో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ పోటీ చేస్తున్నది. బీజేపీ 149 డివిజన్లలో, కాంగ్రెస్‌ పార్టీ 146, టీడీపీ 106, మజ్లిస్‌ 51 డివిజన్లలో పోటీలో ఉన్నారు.  


logo