శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 09:15:40

నేటితో ముగియ‌నున్న జీహెచ్ఎంసీ నామినేష‌న్ల గ‌డువు

నేటితో ముగియ‌నున్న జీహెచ్ఎంసీ నామినేష‌న్ల గ‌డువు

హైద‌రాబాద్‌: జీహెచ్ఎంసీ‌ ఎన్నిక‌ల నామినేష‌న్ గ‌డువు ఇవాళ ముగియ‌నుంది. ఎన్నిక‌ల క‌మిష‌న్ నామినేష‌న్ల‌కు మూడు రోజులు గ‌డువుఇచ్చింది. ఇందులో భాగంగా నామినేష‌న్ల దాఖ‌లు ప్ర‌క్రియ ఈ నెల 18న ప్రారంభ‌మైంది. షెడ్యూల్ ప్ర‌కారం నామినేష్ల గ‌డువు ఈరోజు 3 గంట‌ల‌కు ముగియ‌నుంది. కాగా, ఇప్ప‌టిర‌కు 537 మంది అభ్య‌ర్థులు 597 నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. పార్టీలు త‌మ‌ అభ్య‌ర్థుల‌ను ఇంకా పూర్తిస్థాయిలో ప్ర‌క‌టించలేదు. దీంతో టికెట్లు ఆశిస్తున్న‌వారు ముంద‌స్తుగా నామినేష‌న్లు దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టికే 125 డివిజ‌న్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మ‌రో 25 డివిజ‌న్ల‌కు ఇవాళ త‌మ అభ్య‌ర్థుల జాబిత‌ను విడుద‌ల చేయ‌నుంది. అదేవిధంగా 44 సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేయాల‌ని ఎంఐఎం నిర్ణ‌యించింది. దీంతో ఈ స్థానాల‌కు ఇవాళ‌ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నుంది.