రేపు కౌంటింగ్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలు కానుంది. నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తామని ఎస్ఈసీ తెలిపింది. మొత్తం 30 కేంద్రాల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున, 16 వార్డులకు మాత్రం రెండు చొప్పున మొత్తం 166 హాళ్లలో ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి హాల్లో 14 టేబుల్స్‌పై ఒక రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక రి చొప్పున అభ్యర్థులు తమ ఏజెంట్లను నియమించుకునే వెసులుబాటు ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాక బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా పద్ధతిలో విజేతలను ప్రకటిస్తారు. రీ కౌంటింగ్ చేయించాలనుకునే అభ్యర్థులు ఫలితాలు ప్రకటించకముందే ఆర్వోకు దరఖాస్తు చేయాలి.
‘కౌంటింగ్'కు ప్రత్యేక పరిశీలకులు
150 డివిజన్ల ఓట్లను లెక్కించేందుకు ఇప్పటికే 30 కేంద్రాలను సిద్ధంచేసిన ఎస్ఈసీ, ప్రతి కేంద్రానికి ఒక ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఉన్న 14 మంది సాధారణ పరిశీలకులతో పాటు మరో 16 మందిని ఎంపికచేసింది. జిల్లాల్లో ఉన్న సీ నియర్ ఆర్డీవోలకు ఈ బాధ్యతలు అప్పగించామని ఎస్ఈసీ పార్థసారథి తెలిపారు.
తాజావార్తలు
- లైంగిక దాడిపై తప్పుడు ఆరోపణలు : రెండు దశాబ్ధాలు జైల్లో మగ్గిన తర్వాత!
- గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన హోంమంత్రి
- హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్ 100.. ఫస్ట్ లుక్ విడుదల
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత