గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 12:42:02

ఆస్తుల సర్వేను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

ఆస్తుల సర్వేను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌ : నగరంలో కొనసాగుతున్న ఆస్తుల ఆన్‌లైన్‌ సర్వే కార్యక్రమాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సోమవారం పరిశీలించారు. లింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో కమిషన్‌ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్ష్యం ప్రకారం ఆస్తుల సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే మరింత వేగంగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కమిషనర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లోని వ్యవసాయేతర ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేసేందుకు ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo