శనివారం 06 జూన్ 2020
Telangana - May 19, 2020 , 17:12:29

షాపులు రోజు విడిచి రోజు తెరిచేందుకు అనుమతి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

షాపులు రోజు విడిచి రోజు తెరిచేందుకు అనుమతి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో షాపులు రోజు విడిచి రోజు తెరిచేందుకు అనుమతి ఉందని  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌  తెలిపారు. మలక్‌పేట్‌లో షాపుల మార్కింగ్‌ను కమిషనర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  షాపుల నిర్వహణను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. 

'నిత్యావసర వస్తువులు విక్రయించే షాపులు యథావిధిగా నడుస్తాయి. మాల్స్‌, రెస్టారెంట్లు, బార్లు, సినిమాహాళ్లు మూసి ఉంచాలి. కంటైన్మెంట్‌ జోన్లలోని షాపులన్నీ  మూసే ఉండాలి. దుకాణాల్లో పనిచేస్తున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మాస్క్‌ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తాం.  ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల దగ్గర శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. నిబంధనలు అతిక్రమించి షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని' కమిషనర్‌ హెచ్చరించారు. 


logo