శనివారం 11 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 20:52:22

గూగుల్‌ మీట్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

గూగుల్‌ మీట్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

హైదరాబాద్‌ : ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్‌ ప్రభావంతో  ప్రజావాణి కార్యక్రమాన్నిరద్దు చేశారు. ఈ క్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి గూగుల్‌ మీట్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు వినతులు స్వీకరించనున్న చెప్పారు. htpp;//meet.google.com/poj-qrex-hzb లింక్‌లో ప్రజలు ఇంటి వద్ద నుంచే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.


logo