శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 08:28:58

కరోనా అనుమానితుల ఇండ్లు జియో ట్యాగింగ్‌

కరోనా అనుమానితుల ఇండ్లు జియో ట్యాగింగ్‌

 హైదరాబాద్‌ : రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కరోనా అనుమానితుల ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేశారు. ఐసోలేషన్‌లో ఉన్న వారందరినీ, వారి కదలికలను నిత్యం గమనించేందుకు ఈ జియో ట్యాగింగ్‌ ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తారు. టీఎస్‌ కాప్‌లో ఉన్న అప్లికేషన్‌ ద్వారా విదేశాల్లో నుంచి వచ్చి ఐసోలేషన్‌లో ఉన్న వారి ఇంటిని జియో ట్యాగ్‌ చేస్తారు. దీంతో వారి ఇంటి నంబరు, ఇంట్లో ఎంత మంది నివాసం ఉంటున్నారు. విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారు. ఏ దేశం నుంచి వచ్చారు. వారు ఎన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి ఇలా అన్ని వివరాలను పోలీసులు అప్లికేషన్‌లో భద్రపరుస్తున్నారు. 

ఈ జియో ట్యాగ్‌ను పెట్రోలింగ్‌, గల్లీ గస్తీ సిబ్బంది ట్యాబ్‌లకు అనుసంధానం చేశారు. వీటి ఆధారంగా చేసుకుని పెట్రోలింగ్‌ సిబ్బంది వారి విధుల్లో భాగంగా ఐసోలేషన్‌లో ఉన్న వారి కదలికలు గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏలా ఉంది.. ఐసోలేషన్‌లో వారి ఏలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఆ ఇంట్లోని వారు ఏలాంటి వైద్య సేవలు పొందుతున్నారు. ఇలా అన్నింటిని పెట్రోలింగ్‌ సందర్భంగా పరిశీలించి పోలీసులు అప్రమత్తమవుతారు. 


logo