బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 17:14:49

భద్రాద్రి థర్మల్‌ కేంద్రం పనులు పరిశీలించిన జెన్‌కో సీఎండీ

భద్రాద్రి థర్మల్‌ కేంద్రం పనులు పరిశీలించిన జెన్‌కో సీఎండీ

హైదరాబాద్‌ : భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు శుక్రవారం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల ప్రగతిపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. పూర్తయిన పనులు.. చేపట్టాల్సిన వాటిపై అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీటీఎస్‌కు చెందిన మిగిలిన మూడు యూనిట్ల పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. నిర్వాసితులకు ఆరు నెలల్లో ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.