సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:21:18

రేవంత్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

రేవంత్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

  • టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాత సచివాల యం భవనం జీ బ్లాక్‌లో నిజాంనాటి గుప్తనిధులు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌చేశారు. సీఎం కేసీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. గుప్తనిధుల పేరిట సచివాలయ కూల్చివేతపై వివాదం సృష్టించడమంటే.. మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టడమేనన్నారు. భద్రతాకారణాల వల్లనే పాత సచివాలయం కూల్చివేత సమీపంలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించిందని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో గెల్లు శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి కట్టుకథలు చెప్తే నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. రేవంత్‌ ప్రస్తావిస్తున్న అంశాలేవీ ప్రజా సమస్యలకు సంబంధించినవి కావని.. సంచలనాలకోసమే మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.   


logo