బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 18:12:21

ప్రాణాలకు తెగించిన గౌడన్నలు..వీడియో

ప్రాణాలకు తెగించిన గౌడన్నలు..వీడియో

కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కిన ఓ గీతకార్మికుడు.. తన కాలికి కట్టిన మోకు తెగిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నాడు. నడుముకు ఉండేటి తాడు బిగుసుకుపోవడంతో కాపాడాలంటూ ఆర్తనాదాలు పెట్టుకున్న సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పర్లపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది.  ఆ గీతకార్మికుడు ఆర్తనాదాలు విన్న తోటి వారు వెంటనే తాటిచెట్టు ఎక్కి చాకచక్యంగా రక్షించారు. 

పర్లపెల్లి గ్రామానికి చెందిన నూనె సంపత్ గౌడ్ వృత్తిలో భాగంగా కల్లు గీస్తుండగా ప్రమాదంలో చిక్కుకున్నాడు. చెట్టునుంచి జారి పోతూ.. రక్షించాలని వేడుకున్నాడు. అతని కేకలు విన్న మామిండ్ల బాలరాజ్ గౌడ్, తిరుపతి గౌడ్‌లు వారి ప్రాణాలకు తెగించి చెట్టుమీద నుంచి సంపత్‌గౌడ్‌ను సురక్షితంగా కిందికి దించారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో చూసినవారంతా గీతవృత్తి కార్మికుల సమయస్ఫూర్తికి సలాం చేస్తున్నారు.
logo
>>>>>>