బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 00:44:02

గేట్‌ ఫలితాలు విడుదల

గేట్‌ ఫలితాలు విడుదల
  • వరంగల్‌ నిట్‌ విద్యార్థులకు 4, 12 ర్యాంకులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గేట్‌-2020 పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఫలితాలను గేట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించారని నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్వీ రమణరావు తెలిపారు. ఇందులో విదిశ (ఎంఎంఈ) 4, దక్ష్‌ పల్‌మార్‌ (బయోటెక్‌) 12,  దినేశ్‌రెడ్డి (ఈఈఈ) 66, విష్ణుతేజ (ఈఈఈ) 179, దీపక్‌ కార్తికేయ (ఎంఎంఈ) 181, వివేక్‌ శ్రీవాస్తవ (సీఈ) 110, అబ్బాస్‌ దాస్‌గుప్త (సీఎస్‌ఈ) 22, శశిధర్‌ గంగవరపు (ఎంఎంఈ) 30వ ర్యాంకులు సాధించారని వెల్లడించారు. logo
>>>>>>