శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 02, 2020 , 18:46:21

గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌... ఇల్లు దగ్ధం

గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌... ఇల్లు దగ్ధం

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని భూదన్‌పోచంపల్లి మండల పరిధిలోని పిలాయిపల్లి గ్రామంలో సిలిండర్ లీక్ కావడంతో ఇల్లు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తే పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన ఆలూరి కృష్ణ భార్య బాలమణి  వంట చేస్తుండగా సిలిండర్ గ్యాస్ అయిపోయింది. దీంతో ఇంటో గ్యాస్ సిలిండర్ బిగించగా అది సరిగ్గా బిగించగా పోవడంతో అందులోనుంచి గ్యాస్ లీక్ అయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు చెందిన బాలమని మంటలను చూసి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున చెలరేగి వంటగదిని ఆక్రమించాయి తర్వాత హాలులో మంటలు ఆక్రమించడంతో ఇంట్లో ఉన్న వారందరూ బయటికి పరిగెత్తారు.

 ఈ సమయంలో బాలమ్మ తో పాటు ఆమె  ఇద్దరు కుమార్తెలు కుమారుడు తో పాటు అత్త ఉన్నారు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కృష్ణ వంటింట్లోని వంట సామాగ్రి తో పాటు రిఫ్రిజిరేటర్, హాలులో ఉన్న టీవీ ఫర్నిచర్ కంప్యూటర్ తో పాటు పలు వస్తువులు మంటల్లో ఆహుతయ్యాయి. ఈ సంఘటనలో సుమారు రూ.4 లక్షల వరకూ ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు.

 

కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పిలాయిపల్లి లో జరిగిన సంఘటనను తెలుసుకొని ఆయన కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుండి తగిన విధంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.


logo