సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 15:35:44

ఉదారతను చాటిన మంత్రి గంగుల కమలాకర్

ఉదారతను చాటిన మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ : నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీ ఉండే మంత్రి ఓ అభాగ్యుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆపదలో ఉన్న వ్యక్తికి చేయూత నిచ్చి తన ఉదారతను చాటాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పద్మానగర్ బై పాస్ రోడ్డులోని రాంచంద్రపూర్ చేపల మార్కెట్ ప్రాంతంలో డీసీఎం వ్యాన్ కారును ఢీ కొట్టడంతో .. కారు నడుపుతున్న వ్యక్తి  తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహ తప్పి రోడ్డు పక్కన కింద కూర్చున్నాడు.

నగరంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని ఐటీ టవర్ పనులను పరిశీలించేందుకు  పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెళ్తున్నారు. సదరు వ్యక్తిని చూసి ఒక్కసారిగా తన కాన్వాయిని ఆపి ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాద ఘటనను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

స్థానికులు 108 కి సమాచారం ఇచ్చినప్పటికీ సమయానికి చేరుకోలేదు. వెంటనే మంత్రి గంగుల స్పందించి ఉదారతతో  గాయపడిన వ్యక్తి ని దవాఖానకు తీసుకెళ్లాల్సిందిగా తన వ్యక్తిగత సిబ్బంది ని ఆదేశించారు. గాయపడిన వ్యక్తి కి నీళ్లు  తాగించి  మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనంలో  దవాఖానకు తరలించారు.  మంత్రి వెంట  మేయర్ వై. సునీల్ రావు  తదితరులు ఉన్నారు.


logo