ఆదివారం 31 మే 2020
Telangana - May 03, 2020 , 22:25:03

వలస కూలీలను అన్నివిధాలా ఆదుకుంటాం

వలస కూలీలను అన్నివిధాలా ఆదుకుంటాం

టవర్‌ సర్కిల్‌: కరీంనగర్‌ జిల్లాలోని 20 వేల మంది వలస కూలీలకు బాసటగా నిలుస్తామని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. నగర పరిధిలోని హౌసింగ్‌ బోర్టుకాలనీలో 50 మంది వలస కూలీలకు ఆదివారం మేయర్‌ సునీల్‌రావుతో కలిసి సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీప భవిష్యత్‌లో కరీంనగర్‌ గ్రీన్‌జోన్‌లోకి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ విషయంలో కేంద్రం ఇంతవరకు స్పందించలేదని ఆక్షేపించారు. రేషన్‌ లబ్ధిదారులకు రెండో విడుత రూ.1500 నగదు, 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నామని, ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులు, అర్చకులు, నాయీబ్రాహ్మ ణులకు అండగా ఉంటామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యసిబ్బంది, సఫాయి కార్మికులపై భారత ఆర్మీ పూల వర్షం కురిపించి నైతిక మద్దతునివ్వడం సంతోషకరమన్నారు. 


logo