సోమవారం 01 జూన్ 2020
Telangana - May 20, 2020 , 01:08:36

దమ్ముంటే.. పోతిరెడ్డిపాడులో పోరాడు

దమ్ముంటే.. పోతిరెడ్డిపాడులో పోరాడు

  • బీజేపీ నేత బండి సంజయ్‌కి మంత్రి గంగుల సవాల్‌

కరీంనగర్‌, నమస్తేతెలంగాణ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే పోతిరెడ్డిపాడుకు వెళ్లి పోరాడా లని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సవాల్‌ విసిరారు. మంగళవా రం కరీంనగర్‌లో గంగుల మీడియాతో మాట్లాడారు. 2009లో తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు బాబ్లీప్రాజెక్టును అడ్డుకునేందుకు మహారాష్ట్ర వెళ్లి పోలీసులతో దెబ్బతిన్నానని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ కరీంనగర్‌లోనో, హైదరాబాద్‌లోనో ఆందోళన చేస్తే సమస్యకు పరిష్కారం దొరకదని.. ఆంధ్రాప్రభుత్వం మీద పోరాడేందుకు పోతిరెడ్డిపాడును ఎంచుకోవాలని సూచించారు. 

 కేంద్రంలో అధికారంలో ఉండి ఇండ్లపై నల్లజెండాలు ఎగరేసుకోవడం,   ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు  దీక్షలు చేయడం తానెన్నడూ చూడలేదన్నారు.  పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్‌ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారనీ, ఎంతవరకైనా పోరాటం చేస్తామని మంత్రి స్పష్టంచేశారు.  ఉమ్మడి రాష్ట్రంలో 60 రోజుల్లో 20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే తెలంగాణలో 45 రోజుల్లో 49 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.


logo