మంగళవారం 19 జనవరి 2021
Telangana - May 28, 2020 , 02:03:11

నా గతం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు: గంగు ఉపేంద్రశర్మ

నా గతం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు: గంగు ఉపేంద్రశర్మ

రెడ్డికాలనీ(వరంగల్‌): బీజేపీ దాని అనుబంధ సంస్థల నాయకులు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని, తన గతం గురించి మాట్లాడే అర్హత వారికి లేదని తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, బీజేపీకి అనుకూలంగా ఉంటేనే హిందువులా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే హిందూ దేవాలయాలను పట్టించుకొని అభివృద్ధి చేశారని అందుకే ఆయనంటే తనకు అభిమానం అన్నారు. అంతేకాని తాను ఏ పార్టీ సభ్యుడిని కాదన్నారు.