గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 11:01:11

బైకులు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

బైకులు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

హైదరాబాద్‌ :  బైకులను చోరీ చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను శనివారం మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.  ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన 6 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నగరంలో పలు ప్రాంతాల్లో  బైకులను చోరీ చేసి విక్రయించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో నిందితులు బైకు చోరీలను ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం అన్నివివరాలు వెల్లడిస్తామని  ఎన్‌ఐ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.