గురువారం 04 జూన్ 2020
Telangana - May 12, 2020 , 11:49:36

నర్సుల సేవలను కొనియాడిన గాంధీ సూపరింటెండెంట్‌

నర్సుల సేవలను కొనియాడిన గాంధీ సూపరింటెండెంట్‌

సికింద్రాబాద్‌ : నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జ్ఞాపకార్థంగా నర్సుల దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. నైటింగేల్‌ 200వ జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించారు. గాంధీ వైద్య సిబ్బంది నైటింగేల్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. నర్సుల సేవలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు కొనియాడారు. కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా నర్సులు ముందంజలో ఉంటూ గొప్ప సంకల్పాన్ని చూపిస్తున్నారన్నారన్నారు. అంటువ్యాధులు, మహమ్మారి వ్యాధులతో పోరాడటంలో నర్సులు ఎల్లప్పుడు ముందంజలో ఉన్నట్లు తెలిపారు. నర్సుల సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.


logo