శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 19:35:26

పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ...

పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీ...

హైదరాబాద్‌: కరోనా నియంత్రణ చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా మూడో దశకు చేరుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షలో చర్చించారు. గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మర్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో పనిచేసేవారు, ఆశావర్కర్లు, ఎక్కడివారు అక్కడే ఉండాలి. సిబ్బందికి భోజనం, రవాణా సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ... విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తిస్థాయిలో పరిశీలనలో ఉంచాలి. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో వారిని కూడా అబ్జర్వేషన్‌లో ఉంచాలి. వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వకూడదు. కావాల్సిన పరికరాలు అన్నీ సమీకరించుకోవాలి. కరోనా సోకిన వారిలో ఇద్దరు ప్రైవేటు వైద్యులు ఉన్నారని తెలిపారు. 


logo