సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 19:01:27

ఆస్తుల నమోదు పూర్తయిన తొలి మున్సిపాలిటీగా గజ్వేల్‌

ఆస్తుల నమోదు పూర్తయిన తొలి మున్సిపాలిటీగా గజ్వేల్‌

సిద్దిపేట : రాష్ట్రంలోనే ధరణీ పోర్టల్‌లో పట్టణ ఆస్తుల గణన పూర్తయిన తొలి మున్సిపాలిటీగా గజ్వేల్‌ నిలిచింది. కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి ప్రత్యేక కార్యాచరణ, మార్గదర్శనంలో గజ్వేల్‌ మున్సిపాలిటీకి అరుదైన ఘనత దక్కింది. జిల్లా యంత్రాంగం ఆదేశాలు మేరకు ఈ నెల 9న ప్రాపర్టీ ఎన్యుమరేషన్‌ను ప్రారంభించారు. 81 మందికిపైగా అధికారులు, సిబ్బంది 27 బృందాలుగా ఏర్పడి బుధవారం వరకు ఆస్తుల నమోదు ప్రక్రియను వందశాతం పూర్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 8700 ఆస్తులను ఐదు రోజుల్లో ముగించారు. రాష్ట్రంలోనే గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రాపర్టీ ఎన్యుమరేషన్ పూర్తి చేసినందుకు కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అలాగే సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు సహకరించిన అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ ఖాన్‌, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోద్దిన్, కమిషనర్ శ్రీకృష్ణారెడ్డిని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo