శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:46:48

గజ్వేల్‌ హరితవనం కావాలి

గజ్వేల్‌ హరితవనం కావాలి

  • రోడ్లకిరువైపులా సందులేకుండా చెట్లుండాలి
  • మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
  • గడా ఓఎస్డీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్‌

గజ్వేల్‌: ‘గజ్వేల్‌ నియోజకవర్గం హరితవనంగా కనిపించాలి. మొక్కలునాటి వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. గడా ఓఎస్డీ ముత్యంరెడ్డిని ఆదేశించారు. గజ్వేల్‌లో ఆరోవిడత హరితహారం పనులపై ఓఎస్డీ ముత్యంరెడ్డికి శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఫోన్‌చేసి వివరాలు తెలుసుకొని, పలు సూచనలుచేశారు. 

‘ఇప్పటివరకు నాటిన మెక్కలు పెరిగి పెద్దవయ్యాయి. వాటి సంరక్షణపై దృష్టిపెట్టండి. నియోజకవర్గలోని అన్ని రోడ్లకిరువైపులా చెట్లు పెరగాలి. ఎక్కడా కూడా ఖాళీగా ఉండకుండా చూడండి. గ్రామాల్లో ఇంకా ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటి, పెంచాలి. ప్రతివాడలో ఎటుచూసినా పచ్చని చెట్లు కనిపించాలి. ప్రతిఒక్కరి ఇంటి ఆవరణలో పండ్లు, పూలు ఇతరరకాల చెట్లు పెరిగేలా చూడాలి. ప్రతి ఊరు పచ్చని వనంగా కనిపించాలి. ఇందుకోసం ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఫారెస్టు అధికారులను సిద్ధంచేయండి’ అని సీఎం కేసీఆర్‌ సూచించినట్టు ఓఎస్డీ ముత్యంరెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్‌  సూచన చేయగానే గడా ఓఎస్డీ వెంటనే సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు.

తాజావార్తలు


logo