మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 14:44:42

‘జనతాబంద్’కు మద్దతుగా గజల్... వీడియో

‘జనతాబంద్’కు మద్దతుగా గజల్... వీడియో

ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తున్న కరోనాపై యుద్ధం ప్రకటించాయి ఆయా దేశాలు. ఈ మహమ్మారిపట్ల వివిధ రూపాల్లో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి ప్రపంచదేశాలు. మనదగ్గర కూడా రేపు దేశవ్యాప్తంగా ‘జనతాబంద్’ను చేపడుతున్నారు. ఈనేపథ్యంలో అధికారులు, సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు వివిధ రూపాల్లో జనతాబంద్పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన గజల్స్ సింగర్ స్వరూప.. ‘మహమ్మారి కరోనాను అడ్డుకోవాలి జనం’ అంటూ చక్కని గజల్ ఆలపించారు. జనతాబంద్లో ప్రజలంతా పాల్గొనాలని గజల్ ద్వారా పిలుపునిచ్చారు స్వరూప. ఈ గజల్ను ప్రముఖ గజల్స్ రచయిత్రి ఎంబీడీ శ్యామల రచించారు. వీరిద్దరి కలయికలో ‘నీది నాది ఒకే కథ’ సినిమాలో ‘హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది’ అనే గజల్ వచ్చింది. ఇది తెలుగునాట బాగా ఫేమస్ అయింది.


logo
>>>>>>