బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 12:22:21

భారీ వర్షానికి గద్వాల-రాయచూర్ ప్రధాన రహదారి ధ్వంసం

భారీ వర్షానికి గద్వాల-రాయచూర్ ప్రధాన రహదారి ధ్వంసం

జోగులాంబ గద్వాల : అర్ధరాత్రి భారీ వర్షం కురువడంతో రహదారి కొట్టుకు పోయిన ఘటన జిల్లాలోని కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. గద్వాల నుంచి రాయచూర్ వెళ్లే ప్రధాన రహదారి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. నందిని గ్రామం దగ్గర ఉన్న గద్వాల -రాయచూర్ వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. 

బ్రిడ్జి నిర్మాణం కారణంగా తాత్కాలిక రోడ్డుపై రాకపోకలు జరుగుతున్నాయి. కాగా, అర్ధరాత్రి నందిని గ్రామంలో భారీ వర్షం కురవడంతో తాత్కాలికంగా ఉన్న రోడ్డు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో గద్వాల నుంచి రాయచూర్ కు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు వ్యవసాయ బావుల వద్దకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.


logo