సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 16:53:40

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ గద్వాల డీఎంహెచ్ వో

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ  గద్వాల డీఎంహెచ్ వో

జోగులాంబ గద్వాల : మెడికల్ అధికారి రిలీవింగ్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తూ గద్వాల డీఎంహెచ్ వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు..జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో మెడికల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఏ. మంజుల కాకతీయ యూనివర్సిటిలో పీజీలో జాయినింగ్ కోసం రిలీవింగ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేసుకుంది. 

డబ్బులు ఇస్తానంటే రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తాను అని   డీఎంహెచ్ వో  చెప్పడంతో భీమ్ నాయక్ ఆమె మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ రోజు గద్వాల పట్టణంలోని డీఎంహెచ్ వో కార్యాలయంలో ఆమె రూ.7,000 నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ దాడులో 500 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు  ఏసీబీ డీఎస్పీ కృష్ణా గౌడ్  తెలిపారు. ఈ దాడులో మహబూబ్ నగర్, నలగొండ ఏసీబీ  సీఐ ప్రవీణ్ కుమార్, లింగస్వామి సిబ్బంది పాల్గొన్నారు‌.logo