శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 20:30:36

నెర‌వేరిన 'గ‌ట్టు' ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక‌.. సీఎంకు కృత‌జ్ఞ‌తలు

నెర‌వేరిన 'గ‌ట్టు' ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక‌.. సీఎంకు కృత‌జ్ఞ‌తలు

హైద‌రాబాద్ : గట్టు ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు గాను సీఎం కేసీఆర్‌కు గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకాల టెండర్లు పిలిచి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాల్సిందిగా నీటిపారుదలశాఖ ఉన్న‌తాధికారుల‌కు సీఎం సోమ‌వారం ఆదేశాలు జారీచేశారు. దీనిపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు,  అల్లంపూర్ ఎమ్మెల్యే డా. అబ్రహం మంగ‌ళ‌వారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గద్వాల నియోజకవర్గ రైతులు, ప్రజల తరఫున పూలకుండి ఇచ్చి ప్ర‌త్యేక‌ కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా గద్వాల ప్రాంతం అభివృద్ధికి భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో గట్టు మండల ఎంపీపీ విజయ్ కుమార్, ధరూర్ మండల టీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నేత సర్వా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo