శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 15:38:00

వారం రోజుల్లో జీవో జారీ చేస్తాం : మంత్రి కేటీఆర్

వారం రోజుల్లో జీవో జారీ చేస్తాం : మంత్రి కేటీఆర్

నిర్మల్ : భైంసా పట్టణంలోని శివారు కాలనీలను పారిశ్రామిక ప్రాంతం నుంచి రెసిడెన్షియల్ జోన్ గా మార్చడానికి అవసరమైన ఉత్తర్వులను వారం రోజుల్లో జారీ చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ లోని మంత్రి ఛాంబర్లో ఆయనను ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ భైంసా పట్టణంలో శివారు కాలనీలు పారిశ్రామిక ప్రాంతంలో ఉండటంతో ప్రజలు లబ్ధి పొందలేకపోతున్నారని  ఎమ్మెల్యే వివరించారు. 

భైంసా పట్టణం విస్తరించడం వల్ల శివారు కాలనీల్లో వేగంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ కాలనీలు పారిశ్రామిక ప్రాంతంలో ఉండడంతో రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్ లు, ఇతర విషయాల్లో ప్రజలకు అవస్థలు తప్పడం లేదన్నారు. ఈ విషయంపై స్పందించిన కేటీఆర్ సంబంధిత ఫైలును వెంటనే తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో అవసరమైన ఉత్తర్వులు జారీ చేసి పారిశ్రామిక ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.


logo