భిన్న వ్యక్తిత్వం కేటీఆర్ సొంతం


Tue,July 25, 2017 01:56 AM

Future Perfect Ktr Book Release

-సిరిసిల్ల కార్మికులను, సిలికాన్ సీఈవోలనూ మెప్పించారు
-ఫ్యూచర్ పర్‌ఫెక్ట్ కేటీఆర్ పుస్తకావిష్కరణలో వక్తల ప్రశంస

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణ నేతల పాలనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ప్రత్యేకత రాష్ట్ర మంత్రి కే తారకరామారావుకు దక్కుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సిరిసిల్ల చేనేత కార్మికుల నుంచి సిలికాన్ వ్యాలీలోని సీఈవోలదాకా అందిరినీ మెప్పించిన ఘనత కేటీఆర్ సొంతమని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర ఐటీశాఖ డైరెక్టర్ దిలీప్ కొణతం రచించిన ఫ్యూచర్ పర్‌ఫెక్ట్ కేటీఆర్ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఎస్‌టీఎస్‌సీ చైర్మన్ రాకేశ్‌కుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులు, తెలంగాణవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ కేటీఆర్ భిన్నమైన నాయకుడన్నారు.
KTR-BOOK1

సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాక కేంద్రం వీఐపీల వాహనాల బుగ్గలు తొలిగించడం మొదలుపెట్టిందని, అయితే కేటీఆర్ మంత్రిగా ప్రమాణం చేసిన నాటినుంచే దాన్ని పాటిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ ఓవర్‌నైట్ హీరో కాలేదని, ఆయన ప్రయాణం ఉద్యమ నిర్బంధాల ముండ్లబాటమీదుగా సాగిందని చెప్పారు. ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ మాట్లాడుతూ కేటీఆర్ సీఎం తనయుడుగానే రాజకీయ ప్రవేశం చేశారనుకుంటారని, అది నిజం కాదని అన్నారు. అడ్డదారిలో కాకుండా ఉద్యమంతో మమేకమై ముళ్లకంచెలు దాటిన నాయకుడు కేటీఆర్ అని అన్నారు. నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అసాధారణమైన చొరవ, వేగంగా ఆకళింపు చేసుకునే మేధస్సు కలిగిన ఒక అరుదైన నాయకుడిగా కేటీఆర్ అచిరకాలంలోనే ఎదిగారని చెప్పారు. ప్రజల కష్టనష్టాలు తెలిసిన నాయకత్వం, అట్టడుగు జనంనుంచి అంతర్జాతీయ వేదికలదాకా అంతే అర్థవంతంగా మాట్లాడగల నాయకత్వం లభించడం తెలంగాణ అదృష్టమని అన్నారు. తెలంగాణ టుడే సంపాదకులు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అడ్డగుట్ట నుంచి అమెరికాలోని అత్యున్నత స్థాయిలో ఉన్న సీఈవోలదాకా అందరినీ ఆకట్టుకునే మాటతీరు, వారితో కలుపుగోలుగా మాట్లాడే శక్తి మంత్రి కేటీఆర్ సొంతం. పారిశ్రామిక రంగం, ఐటీ, మానవవనరులు, ప్రాజెక్టులువంటి అంశాల్లో తెలంగాణ మిగతా రాష్ర్టాలకు ఆదర్శప్రాయంగా మారింది.
KTR-BOOK

ఈ కీలక పరిణామాల్లో మంత్రి కేటీఆర్ ప్రాధాన్యతను, భాగస్వామ్యాన్ని ఈ పుస్తకంలో రచయిత స్పష్టంగా వివరించారు అన్నారు. పుస్తక రచయిత దిలీప్ కొణతం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తాము చేసింది చెప్పుకొనే అలవాటు లేదన్నారు. ఆ కారణంగానే తెలంగాణకు సంబంధించిన విస్తృతమైన పరిజ్ఞానం అందుబాటులో లేకుండా పోయిందన్నారు. మూడేండ్లలోనే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో మార్గదర్శకంగా మారిందని, ఈ ప్రక్రియలో మంత్రి కేటీఆర్ కోర్ టీంలో భాగం పంచుకున్నవాడిగా ప్రజలకు తెలియని అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచానన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నంత మంది ఉద్యమకారులు మరే దేశంలోనూ లేరని ఘంటాపథంగా చెప్పగలనని దిలీప్ స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన వారికి మొక్కలను పంపిణీ చేశారు.

2188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles