సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 14:17:18

మ‌త్స్యకారుల బ‌లోపేతానికి మ‌రింత కృషి : మంత్రులు

మ‌త్స్యకారుల బ‌లోపేతానికి మ‌రింత కృషి : మంత్రులు

హైదరాబాద్ : మ‌త్స్య కారుల అభివృద్ధి, మ‌త్స్య స‌హ‌కార సంఘాల బ‌లోపేతానికి ప్రభుత్వం మ‌రింత క‌షి చేస్తుందని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, ప‌శు సంవర్ధక శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. కొత్త పంచాయ‌తీరాజ్ చ‌ట్టం, చెరువుల్లో చేప పిల్లల విత్తనాలు వేయ‌డం, చేప‌ల చెరువులో మ‌త్స్య స‌హ‌కార సంఘాల‌కు చెరువుల‌ కేటాయింపు త‌దిత‌ర అంశాల‌పై మంత్రులు, రాజ్యసభ స‌భ్యుడు బండా ప్రకాశ్, పంచాయ‌తీరాజ్, ప‌శు సంవర్ధక శాఖ‌ల కార్యదర్శులు, క‌మిష‌న‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి హైద‌రాబాద్ లోని పంచాయ‌తీరాజ్ మంత్రి పేషీలో స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. అడుగంటిన కుల వృత్తుల‌ను ఆదుకోవ‌డానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంద‌న్నారు. ఇందులో భాగంగా, మ‌త్స్యకారుల అభివృద్ధికి చెరువుల్లో చేప‌ల విత్తనాలను ఉచితంగా అందజేస్తుందన్నారు. దీంతో మ‌త్స్య సంప‌ద పెరిగి, చేప‌లు ప‌ట్టేవారికి ఆదాయం పెరిగి మంచి అభివృద్ధిని సాధిస్తున్నార‌న్నారు. 

 కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయ‌తీల్లో కొన్ని స‌మ‌స్యలు వస్తున్నట్ల త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. వాటిని స్థానికంగానే నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ప‌రిష్కరించుకోవాలని సూచించారు. అయితే, నిబంధ‌న‌ల ప్రకారమే చెరువుల కేటాయింపులు జ‌రిగే విధంగా చ‌ర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, డీపీలో ల ను ఆదేశించాలని సెక్రెటరీల ను మంత్రులు ఆదేశించారు.


logo