గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 14:57:10

అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి : మంత్రి కేటీఆర్‌

అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర పురపాలకశాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీలో సమగ్ర సివరేజ్‌ మాస్టర్‌ప్లాన్‌ కోసం నిధులు మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌పురి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు. 

వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో నియో ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని విన్నవించారు.  పురపాలకశాఖ ద్వారా పలు పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి సహకరించాలని, ఘన వ్యర్థాలు, మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, బయో మైనింగ్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆమోదించడంతోపాటు రానున్న కేంద్ర బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo