చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల

హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. నిధుల విడుదలకు సంబంధించిన జీవో ప్రతులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ సంబంధిత సంబంధిత సంస్థలకు అందజేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపురం కోట పునర్నిర్మాణం కోసం 1 కోటి 26 లక్షల రూపాయలు, నేలకొండపల్లిలోని బుద్ధిజం చరిత్ర కాపాడడానికి రూ. 1 కోటి 36 లక్షలను అదేవిధంగా ప్రముఖ శక్తి పీఠం జోగులంబా దేవాలయం వద్ద పర్యాటక మౌలిక సౌకర్యాల అభివృద్ధి కొరకు రూ. 36.73 కోట్లను కేటాయిస్తూ జీవోలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటక ప్రదేశాలు, హెరిటేజ్ తెలంగాణకు చెందిన చారిత్రక నేపథ్యం గల ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రముఖ శక్తి పీఠం అలంపూర్ జోగులంబా దేవాలయం వద్ద పర్యాటక మౌలిక సౌకర్యాల అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పార్కింగ్, లైటింగ్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, మంచినీటి వసతి, సౌచాలయాలు, వరదనీటి కాల్వల అభివృద్ధి వీటితో పాటు బస్ షల్టర్, యాంఫీ థియేటర్, ఫుడ్ కోర్ట్స్, అంతేకాకుండా తుంగభద్ర ఘాట్ అభివృద్ధి, బోటింగ్ సౌకర్యాలు, అప్రోచ్ లెవల్ సౌకర్యాల కోసం పాత్ వే లు, లైటింగ్, సైనేజీలు, సూచిక బోర్డుల వంటి పనులను చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, టూరిజం ఎండీ మనోహర్, ఈడీ శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
- స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడండి
- పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలి
- ఆహార భద్రత పథకంలో నిర్లక్ష్యం తగదు
- ఉదాత్తురాలు వాణీదేవి
- సభ్యత్వం స్వీకరించిన వలసజీవులు..
- రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
- మిషన్ భగీరథ నీటిపై అవగాహన
- ఎమ్మెల్యేలదే బాధ్యత
- జోరుగా సభ్యత్వ నమోదు