శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:29:41

రోడ్ల నిర్మాణానికి నిధులు

రోడ్ల నిర్మాణానికి నిధులు
  • కేంద్రమంత్రి తోమర్‌కు రాష్ట్రమంత్రి కొప్పుల వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జగిత్యాల జిల్లాలోని పలు రోడ్లకు నిధులు మంజూరుచేయాలని కోరుతూ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. కేంద్రమంత్రి నరేందర్‌సింగ్‌తోమర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఢిల్లీలో మంగళవారం కేంద్రమంత్రిని కలిసిన కొప్పుల ఇందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. జగిత్యాల జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా వరకు 157.90 కిలోమీటర్ల పరిధిలో 44 రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని కోరారు. ఈ విషయాన్ని త్వరలోనే పరిశీలిస్తామని తోమర్‌ హామీ ఇచ్చినట్టు మంత్రి కొప్పుల తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. ఢిల్లీ పర్యటనలో భాగంగా హౌసింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ నాగరాజును కూడా కలిసి నిధులు మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు. logo