బుధవారం 08 జూలై 2020
Telangana - Apr 26, 2020 , 01:10:43

భళా.. బాలకిరణ్‌

భళా.. బాలకిరణ్‌

  • వైకల్యాన్ని లెక్కచేయక వలంటీర్‌గా విధులు
  • టెక్కీకి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది. రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరిగినా.. లాక్‌డౌన్‌ వేళ వలంటీర్‌గా సేవచేయాలన్న ఆశయం ఆదర్శంగా నిలిచింది. కొంతకాలం కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కే బాలకిరణ్‌కుమార్‌కు కాలు, చేయి విరిగాయి. కర్రసాయం ఉంటేనే స్వయంగా నిలబడగలడు. అయినప్పటికీ స్నేహితుడు హరీశ్‌జైనీ సహకారంతో కరోనా లాక్‌డౌన్‌లో నెలరోజుల నుంచి వలంటీర్‌గా సేవలందిస్తున్నారు. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల సమన్వయంతో వారానికి ఐదురోజులపాటు రోజుకు 6-8 గంటలు కూకట్‌పల్లి ఉషా ముళ్లపూడి కమాన్‌ వద్ద పనిచేస్తున్నారు. టెక్కీ బాలకిరణ్‌ అందిస్తున్న సేవలను ఐటీమంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా అభినందించారు.

బర్త్‌డే వద్దు.. సాయమే ముద్దు

కుమారుడి పుట్టినరోజు వేడుకలను నిర్వహించకుండా.. అందుకయ్యే ఖర్చు మొత్తాన్ని పేదలకు పంచాలని నిర్ణయించారు కూకట్‌పల్లికి చెందిన రెండేండ్ల చిన్నారి మన్వీత్‌ తల్లిదండ్రులు. లాక్‌డౌన్‌ ముగిసేవరకు రోజూ నిరు పేదలకు బియ్యం పంచుతామని చెప్పా రు. విషయాన్ని మన్వీత్‌ తండ్రి శనివారం మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. స్పందించిన కేటీఆర్‌.. మన్వీత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.


logo