ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 11:44:33

ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి ప‌ల్లెచెరువు నీటిమ‌ట్టం

ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి ప‌ల్లెచెరువు నీటిమ‌ట్టం

హైద‌రాబాద్‌: రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని మైలార్‌దేవ్‌ప‌ల్లి ప‌ల్లెచెరువుకు ఎగువ నుంచి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతున్న‌ది. దీంతో ప‌ల్లెచెరువుక‌ట్ట ప్ర‌మాద‌క‌ర‌స్థితిలో ఉన్న‌ది. దీంతో చెరువు నుంచి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో దిగువ‌న ఉన్న అలీన‌గ‌ర్ పూర్తిగా జ‌ల‌మ‌య‌మ‌య్యింది. లోత‌ట్టు ప్రాంతాల్లోని ఇళ్ల‌లోకి నీరుచేరింది. దిగువ ప్రాంతాల్లోని అలీన‌గ‌ర్‌, హ‌షామాబాద్‌, అల్ జుబుల్ కాల‌నీవాసుల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాలని మైకుల ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. ఓఎస్ ఫంక్ష‌న్ హాల్‌లో పున‌రావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ప‌ల్లెచెరువు వ‌ద్ద ప‌రిస్థితిని జిల్లా క‌లెక్ట‌ర్ అమ‌య్ కుమార్‌, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌, రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్‌గౌడ్ స‌మీక్షిస్తున్నారు. 

చెరువులో నీటిని వ‌ద‌ల‌డంతో అలీన‌గ‌ర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది కోట్టుకుపోయారు. దీంతో వారి ఆచూకీకోసం అధికారులు గాలింపు చేప‌ట్టారు. 


logo